Uttar Pradesh: యూపీ ఉపఎన్నిక : రెండు నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్

  • గోరఖ్ పూర్, ఫుల్పూర్ లో కాంగ్రెస్ కు చేదు అనుభవం
  • స్వతంత్ర అభ్యర్థులకు వచ్చినన్ని ఓట్లు కూడా దక్కించుకోని హస్తం
  • ఈ ఘటనతో కాంగ్రెస్ నాయకుల విస్మయం
యూపీలో జరిగిన లోక్ సభ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. గోరఖ్ పూర్, ఫుల్పూర్ లోక్ సభ నియోజకవర్గాల్లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, బీజేపీ రెండో స్థానానికి  పరిమితమైంది. ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోవడం పార్టీ నేతలను విస్మయానికి గురయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పటికీ, కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా దక్కకపోవడం గమనార్హం. ఆయా నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు లభించినన్ని ఓట్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు రాలేదు.
Uttar Pradesh
Congress

More Telugu News