Chandrababu: బహు:శా, చంద్రబాబుకు కలలో కూడా నేనే వస్తున్నానేమో! : వైఎస్ జగన్

  • అసెంబ్లీలో కూడా నా పేరే చంద్రబాబు జపిస్తున్నారు!
  • చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు
  • సంతలో పశువుల మాదిరి మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు
  • పొన్నూరు బహిరంగ సభలో జగన్
బహు:శా, చంద్రబాబునాయుడుకి ప్రతిరోజూ తాను కలలో కనిపిస్తున్నానేమోనని వైసీపీ అధినేత జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఈరోజు ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ పాలన గురించి జగన్ ప్రస్తావించారు. అసెంబ్లీలో ప్రసంగించే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి  చంద్రబాబు మాట్లాడరని, ఎంత సేపటికి తన పేరునే ఆయన జపిస్తున్నారని, చంద్రబాబుకు కలలో కూడా తానే వస్తున్నానేమో అనే అనుమానం వస్తోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని, రాష్ట్రాన్ని అవినీతి నుంచి కాపాడాల్సిన ఒక ముఖ్యమంత్రే అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. సంతలో పశువుల మాదిరి వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు.
Chandrababu
ys jagan

More Telugu News