Pawan Kalyan: పవన్ కల్యాణ్ 'మహాసభ' వద్ద అభిమానుల అత్యుత్సాహం.. ఉద్రిక్తత.. అదుపు చేయలేకపోతోన్న పోలీసులు

షార్ట్స్‌లో చూడండి
గుంటూరులోని నాగార్జునా యూనివర్సిటీ ఎదురుగా 35 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతోన్న జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభ ప్రాంగణానికి పెద్ద ఎత్తున జనసేన కార్య‌క‌ర్త‌లు, ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు వ‌చ్చారు. స‌భా ప్రాంగ‌ణం వ‌ద్ద‌ భారీగా భ‌ద్ర‌తా సిబ్బంది ఉన్న‌ప్ప‌టికీ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌ను అదుపు చేయ‌లేక‌పోయారు. స‌భా ప్రాంగ‌ణానికి కుడివైపున ఓ బారీకేడ్ తెంచుకుని అభిమానులు ముందుకు దూసుకువ‌చ్చారు. ఈ క్ర‌మంలో కొంద‌రికి గాయాలు కాగా వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

మ‌రోవైపు మీడియా వాహ‌నాల వ‌ద్ద ప‌వ‌న్ అభిమానులు అత్యుత్సాహం ప్ర‌దర్శించారు. వాహ‌నాలపైకి దూసుకొచ్చి ర‌చ్చ ర‌చ్చ చేశారు. పోలీసులు ప‌రిస్థితిని అదుపు చేయ‌లేక‌పోతున్నారు. కుర్చీలను విసిరేస్తూ కలకలం రేపారు. కాగా, కాసేప‌ట్లో ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ స‌భా స్థ‌లికి చేరుకోనున్నారు. త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు దిశా నిర్దేశం చేసి, తమ భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టిస్తారు.  
Go Back to Shorts
Pawan Kalyan
Guntur District
Jana Sena

More Telugu News