TRS: కోమటిరెడ్డి రౌడీయిజానికి ఫుల్ స్టాప్ పడే సమయం దగ్గరపడింది: మంత్రి జగదీశ్ రెడ్డి

  • నల్లగొండలో ఇరవై ఏళ్లుగా ఆయన రౌడీయిజం చేస్తున్నారు
  • అక్కడ ఎప్పుడు ఉపఎన్నిక జరిగినా మా గెలుపు ఖాయం
  • నలభై వేల మెజార్టీతో గెలుస్తాం : టీఆర్ఎస్ నేత  జగదీశ్ రెడ్డి
నల్లగొండలో కోమటిరెడ్డి రౌడీయిజానికి ఫుల్ స్టాప్ పడే సమయం దగ్గరపడిందని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఇరవై ఏళ్లుగా నల్లగొండలో ఆయన రౌడీయిజానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. నల్లగొండలో ఎప్పుడు ఉపఎన్నిక జరిగినా టీఆర్ఎస్ విజయం ఖాయమని, నలభై వేల మెజార్టీతో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వాలు రద్దు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ రెండు స్థానాలు ఖాళీ అయిన నేపథ్యంలో అప్పుడే ఉపఎన్నికపై చర్చ మొదలైంది.
TRS
jagdish reddy

More Telugu News