YSRCP: ప్రధాని అపాయింట్ మెంట్ కోసం విజయసాయిరెడ్డి..మీడియాను చూసి వెనుదిరిగిన నేత!

  • మోదీ అపాయింట్ మెంట్ కోసం గంటపాటు విజయసాయి నిరీక్షణ
  • అదే సమయంలో అటుగా వెళ్లిన మీడియా 
  • వెంటనే బయటకు వెళ్లిపోయిన విజయసాయిరెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ కోసం సుమారు గంటపాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిరీక్షించారు. పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో మోదీని కలిసే నిమిత్తం విజయసాయిరెడ్డి వెళ్లారు. అయితే, ఆయన అక్కడ ఎదురుచూస్తున్న సమయంలో మీడియా ప్రతినిధులు అటుగా రావడంతో, విజయసాయిరెడ్డి వెంటనే బయటకు వెళ్లిపోయినట్టు సమాచారం. విజయసాయిరెడ్డి వెంట జగన్ బంధువు వినీత్ రెడ్డి కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా, టీడీపీ ఎంపీలకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ నిన్న అపాయింట్ మెంట్ నిరాకరించిన విషయం తెలిసిందే. టీడీపీ ఎంపీలకు పీయూష్ అపాయింట్ మెంట్ ఇచ్చినప్పటికీ చివరి నిమిషంలో ఆ అపాయింట్ మెంట్ ను రద్దు చేయడం చర్చనీయాంశమైంది. అదే సమయంలో, పీయూష్ గోయల్ ని తిరుపతి వైసీపీ ఎంపీ వరప్రసాద్ కలవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.
YSRCP
Vijay Sai Reddy

More Telugu News