indraja: నా కెరియర్లో నాకు బాగా నచ్చిన సినిమా అదే: ఇంద్రజ

  • గుణశేఖర్ గారు గొప్ప పాత్ర ఇచ్చారు 
  • ఇంతవరకూ 80 సినిమాలు చేశాను
  • పెళ్లి తరువాత సినిమాలకి దూరమయ్యాను  
నటీనటుల కెరియర్లో కొన్ని సినిమాలు మైలురాళ్లుగా మారిపోతుంటాయి .. చెప్పుకోదగినవిగా నిలిచిపోతుంటాయి. "అలా మీ కెరియర్లో చెప్పుకోదగిన సినిమా ఏదని మీరు భావిస్తుంటారు?" అనే ప్రశ్న తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఇంద్రజకి ఎదురైంది.

అప్పుడామె స్పందిస్తూ .." నా కెరియర్లో నాకు బాగా నచ్చిన సినిమా అంటే .. అది 'సొగసు చూడతరమా'నే. నా మీద నమ్మకంతో అలాంటి ఒక మంచి పాత్రను ఇవ్వడం గుణశేఖర్ గారి గొప్పతనం. నా కెరియర్లో బెస్ట్ మూవీ అంటే అదే. ఇంతవరకూ వివిధ భాషల్లో కలుపుకుని 80 సినిమాల వరకూ చేశాను. ఆ తరువాత పెళ్లి చేసుకోవడం వలన, సినిమాలకి దూరం కావలసి వచ్చింది" అంటూ చెప్పుకొచ్చారు.    
indraja
gunasekhar

More Telugu News