financebill 2018: ప్రతిపక్షాల నిరసనలు, ఆందోళనల మధ్యే ఆర్థిక బిల్లుకు లోక్ సభ ఆమోదం

  • చర్చ లేకుండానే ఆమోదం
  • తప్పుబట్టిన ప్రతిపక్షాలు
  • ప్రభుత్వ అహంకారం, ఏకపక్ష ధోరణి అంటూ విమర్శ
ప్రతిపక్షాల నిరసనలను ఏ మాత్రం లక్ష్య పెట్టకుండా మోదీ సర్కారు లోక్ సభలో ఆర్థిక బిల్లును ఈ రోజు పాస్ చేసింది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఆర్థిక బిల్లుపై చర్చ చేపట్టాలని కోరుతూ సభ్యులు స్పీకర్ సుమిత్రా మహాజన్ కు లేఖ ఇచ్చారు. చర్చ లేకుండా బిల్లును ఆమోదించడం అన్నది ప్రభుత్వ అహంకారం, ఏకపక్ష ధోరణికి నిదర్శనంగా ప్రతిపక్షాలు అభివర్ణించాయి. వాస్తవానికి ఆర్థిక బిల్లు 2018ని లోక్ సభలో చర్చకు చేపట్టాలని షెడ్యూల్ లో పేర్కొన్నారు. అయితే, ప్రతిపక్షాలు నుంచి అదే పనిగా నిరసనలు కొనసాగడంతో ప్రభుత్వం చర్చ లేకుండానే దాన్ని మమ అనిపించింది.
financebill 2018
loksabha

More Telugu News