mahindra kuv 100: పెట్రోల్, సీఎన్జీ తో నడిచే కేయూవీ100 కారును విడుదల చేసిన మహింద్రా

షార్ట్స్‌లో చూడండి
మహింద్రా అండ్ మహింద్రా కంపెనీ కేయూవీ 100 కాంపాక్ట్ యూఎస్ వీ మోడల్ కారును విడుదల చేసింది. పెట్రోల్+సీఎన్జీతో నడిచే బై ఫ్యూయల్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.5.16 లక్షలు. డీజిల్ వేరియంట్ కారు ధర రూ.5.42 లక్షలు. డైమండ్ వైట్, డాజ్లింగ్ సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 6 సీటర్ సామర్థ్యం కలిగిన ఈ కారు క్యాబ్ యజమానులకు బాగా అనుకూలంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుందని తెలిపింది. ఐదు సంవత్సరాల వారంటీ, యాసెసరీ ప్యాకేజీ, ఫైనాన్స్ సదుపాయాలు కూడా కంపెనీ అందిస్తోంది. గతేడాది మహింద్రా కేయూవీ 100 ఎన్ఎక్స్ టీని కూడా విడుదల చేసిన విషయం గమనార్హం.
Go Back to Shorts
mahindra kuv 100

More Telugu News