kajal agrawal: సినిమాల్లోకి రాక ముందు ఒకర్ని సినిమాల్లోకి వచ్చిన తరువాత ఒకర్ని ప్రేమించాను: కాజల్

  • సినిమాల్లో రాకముందు ఒకరిని ప్రేమించాను
  • సినిమాల్లోకి వచ్చిన తరువాత ఒకర్ని ప్రేమించాను
  • ప్రియుడితో సమయం కేటాయించేందుకు సమయం దొరకదు
ఇద్దరితో ప్రేమలో పడ్డానని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలిపింది. ఎవరినైనా ప్రేమించారా?, పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, తాను ఎక్కడికి వెళ్లినా ఈ ప్రశ్నలే ఎదురవుతున్నాయని తెలిపింది. సినిమాల్లోకి రాకముందు ఒకరిపై ప్రేమ పుట్టిందని, సినిమాల్లోకి వచ్చిన తరువాత మరొకరిపై ప్రేమ పుట్టిందని తెలిపింది. నటి కాకముందు ప్రేమించడం సులభమేనని చెప్పిన కాజల్, సినీ నటి అయిన తరువాత ప్రేమలో పడడం చాలా కష్టమని పేర్కొంది.

 ప్రేమించిన వ్యక్తిని కలిసేందుకు కూడా సమయం దొరకదని చెప్పింది. ప్రియుడికి సమయం కేటాయించలేనప్పుడు ప్రేమలో పడి మాత్రం ఉపయోగం ఏమిటని ప్రశ్నించింది. ఇంతవరకు తాను హద్దుమీరి ప్రవర్తించింది లేదని చెప్పింది. చాలా మంది హీరోలతో నటించినప్పటికీ వారితో హద్దుల్లోనే నడుచుకున్నానని తెలిపింది. ఇండస్ట్రీలో కొద్దిమంది మినహా ఎవరితోనూ స్నేహంగా కూడా మెలగలేదని చెప్పింది. ఇంతకీ ఎవరిని ప్రేమించారంటే మాత్రం సమాధానం దాటవేసింది.
kajal agrawal
actress
love

More Telugu News