allu arjun: బన్నీ ఎందుకంత స్టార్ అయ్యాడో తెలిసింది: 'నా పేరు సూర్య' విలన్

  • బన్నీ చాలా హార్డ్ వర్కర్ 
  • ఆయన అంకితభావం చూసి షాక్ అయ్యాను 
  • ఆయనతో పనిచేయడం గర్వంగా వుంది
వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య' సినిమా రూపొందుతోంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, అనూప్ సింగ్ ఠాగూర్ విలన్ గా చేస్తున్నాడు. పలు ధారావాహికల్లోను .. హిందీ సినిమాల్లోను చేసిన అనూప్, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన  'రోగ్' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ప్రస్తుతం ఆయన 'నా పేరు సూర్య' సినిమాలో విలన్ గా చేస్తున్నాడు.

తాజాగా ఆయన మాట్లాడుతూ .." ఈ సినిమాలో విలన్ గా నేను చేస్తోన్న పాత్ర నాకెంతో మంచి పేరు తీసుకువస్తుందనే నమ్మకం వుంది. ఫిట్ నెస్ కి సంబంధించిన విషయంలో బన్నీకి .. నాకు ఇంట్రెస్ట్ ఉండటం వలన చాలా తొందరగా కనెక్ట్ అయ్యాము. బన్నీతో కలిసే ప్రతిరోజు జిమ్ చేసేవాడిని. బన్నీ చాలా హార్డ్ వర్కర్ .. ఆయన అంకితభావం చూసి నేను షాక్ అయ్యాను. ఆయన ఇంత పెద్ద స్టార్ ఎలా అయ్యాడనే విషయం .. ప్రత్యక్షంగా చూడటం వలన నాకు తెలిసింది. ఆయనతో కలిసి పనిచేయడం గర్వంగా వుంది" అంటూ చెప్పుకొచ్చాడు. 
allu arjun
anoop thakur singh

More Telugu News