bellamkonda srinivas: బాలీవుడ్ విలన్ కి పెరుగుతోన్న క్రేజ్ .. మరో యంగ్ హీరోతో ఢీ!

  • 'సాక్ష్యం'తో పలకరించనున్న బెల్లంకొండ 
  • ఆ తరువాత మూవీ థ్రిల్లర్ జోనర్లో 
  • ఆల్రెడీ కొనసాగుతోన్న షూటింగ్
తెలుగు దర్శక నిర్మాతలు ఎప్పటికప్పుడు కొత్త విలన్స్ ను రంగంలోకి దింపుతూనే వున్నారు. హీరోను ఒక రేంజ్ లో చూపించాలంటే అందుకు తగిన విలన్ ఉండాలనే కాన్సెప్ట్ తో బాలీవుడ్ నుంచి కొత్త విలన్స్ ను తీసుకొస్తున్నారు. అలా 'సాహో' సినిమాతో తెలుగు తెరకి నీల్ నితిన్ ముఖేశ్ పరిచయం కానున్నాడు. ఆ సినిమా షూటింగు దశలో ఉండగానే నీల్ నితిన్ ముఖేశ్ .. మరో తెలుగు సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

 బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'సాక్ష్యం' రెడీ అవుతోంది. ఈ సినిమా తరువాత నూతన దర్శకుడితో శ్రీనివాస్ థ్రిల్లర్ జోనర్లో ఒక మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో విలన్ గా నీల్ నితిన్ ముఖేశ్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందనీ, హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. విలన్ గా తెలుగులో నీల్ నితిన్ ముఖేశ్ జోరు పెరగడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.    
bellamkonda srinivas
neil nithin mukhesh

More Telugu News