బాలీవుడ్ యాక్షన్ హీరోతో 'మనం' డైరెక్టర్ చిత్రం...!

షార్ట్స్‌లో చూడండి
తెలుగులో అక్కినేని ఫ్యామిలీతో 'మనం' సినిమాని తెరకెక్కించి శభాష్ అనిపించుకున్న దర్శకుడు విక్రమ్ కె కుమార్. తర్వాత ఆయన తమిళంలో హీరో సూర్యతో '24' చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన కలెక్షన్లను కురిపించలేదు. తర్వాత అక్కినేని యువ హీరో అఖిల్‌తో చేసిన 'హలో' చిత్రం కూడా నిరాశ పరిచింది.

దీంతో కొంతకాలంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విక్రమ్.. తాజాగా ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. అది కూడా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కోసం. ఓ ఆసక్తికరమైన స్క్రిప్ట్‌ను రెడీ చేయమని విక్రమ్‌ను అక్కీ కోరినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఆయనకు ఉన్న మార్కెటింగ్‌ను దృష్టిలో పెట్టుకుని విక్రమ్ ఓ మంచి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్లాన్ ప్రకారం, అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈ చిత్రం జూన్‌లోనే సెట్స్‌పైకి వెళుతుంది. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలకు మరింత సమయం వెయిట్ చేయాల్సిందే. కాగా, ఇదివరకే మాధవన్ హీరోగా విక్రమ్ '13బి' అనే హిందీ చిత్రాన్ని విక్రమ్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Bollywood
Vikram K Kumar
13B
Madhavan
Akshay Kumar

More Telugu News