stephen Hawkings: బ్రేకింగ్ న్యూస్... స్టీఫెన్ హాకింగ్ కన్నుమూత

  • ప్రసిద్ధ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్
  • ఆయన వయసు 76 సంవత్సరాలు
  • ఎంతోకాలంగా చక్రాల కుర్చీకే పరిమితం

ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. ఎంతో కాలంగా పార్కిన్ సన్ వ్యాధితో బాధపడుతూ చక్రాల కుర్చీకే పరిమితమైన ఆయన, కన్నుమూశారని కుటుంబసభ్యులు మీడియాకు వెల్లడించారు. స్టీఫెన్ హాకింగ్ తన ఖగోళ సిద్ధాంతాలతో ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. 1942, జనవరి 8న ఇంగ్లండ్ లోని ఆక్స్ ఫోర్డ్ షైర్ లో జన్మించిన ఆయన సెయింట్ ఆల్బన్స్ స్కూల్ లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆపై ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో బీఏ, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో పీహెచ్డీ చేశారు. హాకింగ్ రేడియేషన్, పెన్ రోజ్, హాకింగ్ ఫార్ములా, హాకింగ్ ఎనర్జీ, గిబ్సన్స్ - హాకింగ్ అన్సాట్జ్, ధ్రోన్ హాకింగ్ ప్రీస్కిల్ బెట్ వంటి ఆయన సిద్ధాంతాలు ఉత్సాహిక శాస్త్రవేత్తలకు మార్గదర్శకాలయ్యాయి. 1965లో జేన్ విల్డీని వివాహం చేసుకున్న ఆయన, 1995లో విడాకులు ఇచ్చి అదే సంవత్సరం ఎలానీ మాసన్ ను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు 2006లో విడాకులు ఇచ్చారు. హాకింగ్స్ కు ముగ్గురు పిల్లలు. ఆయన మృతితో శాస్త్ర సాంకేతిక సమాజం తీవ్ర విషాధంలో మునిగింది. 




More Telugu News