mohammad shami: షమీ మంచోడు..అతనిపై ఆరోపణలను నమ్మను: హసీన్ తండ్రి

  • షమీపై విశ్వాసముంచిన మామ
  • వివాదం పరిష్కారానికి నా కుమార్తె అనుకూలంగా ఉంది
  • షమీపై 498 (ఏ), 323, 307, 376, 506, 328 సెక్షన్ల కింద కేసులు
టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై అతని మామ విశ్వాసం వ్యక్తం చేశారు. షమీపై అతని భార్య హసీన్ జహాన్ చేసిన ఆరోపణలపై అతని మామ మహ్మద్ హుస్సేన్ స్పందిస్తూ, షమీ చాలా మంచి వ్యక్తి అని అన్నారు. ఆయన తప్పుచేశాడంటే తాను నమ్మలేకున్నానని ఆయన తెలిపారు. షమీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని అన్నారు. షమీ చాలా తక్కువ మాట్లాడుతాడని ఆయన చెప్పారు. తన అల్లుడు, కుమార్తె మధ్య వివాదం చర్చలతో పరిష్కారమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి తన కుమార్తె కూడా అనుకూలంగా ఉందని ఆయన వెల్లడించారు. కాగా, షమీపై 498 (ఏ), 323, 307, 376, 506, 328 సెక్షన్ల కింద అతని భార్య హసీన్ జహాన్ కేసులు నమోదు చేయించిన సంగతి తెలిసిందే.
mohammad shami
haseen jahan
mohammad hussain

More Telugu News