Chandrababu: బీజేపీ నేతలు మాత్రం అర్థం చేసుకోవట్లేదు : చంద్రబాబు అసహనం
- కష్టపడి సంపాదించుకున్న సొత్తును అన్యాయంగా కోల్పోయాం
- మీకు బాధ కలగదా?
- విష్ణుకుమార్ రాజుని ఉద్దేశించి చంద్రబాబు
‘నేను చెప్పేది సామాన్యుడు సైతం అర్థం చేసుకుంటున్నారు కానీ, బీజేపీ నేతలు మాత్రం అర్థం చేసుకోవట్లేదు’ అంటూ బీజేపీ నేతలపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీలో బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజును ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అరవై ఏళ్లు కష్టపడి సంపాదించుకున్న సొత్తును అన్యాయంగా కోల్పోతే మీకు, బాధకలగదా?’ అని విష్ణుకుమార్ రాజును ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్ర సహకారం వల్లనే అభివృద్ధి జరుగుతోందని విష్ణుకుమార్ రాజు చెబుతున్నారని, మరి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రెండంకెల వృద్ధి రేటు ఎందుకు లేదో చెప్పాలని ఆయన్ని చంద్రబాబు ప్రశ్నించారు.
అసెంబ్లీలో చంద్రబాబు భావోద్వేగం
రాజధాని అంటే ‘డ్రీమ్ సిటీ’ అని హేళన చేస్తారా? రాజధాని నిర్మాణానికి సహకరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా? అంటూ అసెంబ్లీలో చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. ముంబై, బెంగళూరుకు నిధులిచ్చి ఏపీకి ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. ఆర్థికంగా బలంగా వున్న బెంగళూరు ‘మెట్రో’కు రూ.17 వేల కోట్లు కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఏపీ రాజధాని నిర్మాణం పూర్తయితే కేంద్రానికి ఎక్కువ ఆదాయం వస్తుందని, పొరుగు రాష్ట్రాల కంటే గొప్పగా రాజధాని నిర్మించాలన్నది తన కలని చంద్రబాబు అన్నారు.