Pawan Kalyan: రేపు నాపై దాడి జరిగితే ప్రజా జీవితంపై తీవ్ర ప్రభావం: ఏపీ డీజీపీకి పవన్ కల్యాణ్ లేఖ

  • రేపు గుంటూరులో జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభ
  • గతంలో భీమవరంలో ఫ్లెక్సీ చింపేసినందుకే నా అభిమానులు ధర్నా చేశారు
  • ఇటీవల అనంతపురం పర్యటనలో తొక్కిసలాట ఘటన దృష్ట్యా భ్రదత కోరుతున్నాను
  • భద్రతకు పోలీసులు నిస్సహాయత ప్రకటిస్తే ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత
గుంటూరులోని నాగార్జునా యూనివర్సిటీ ఎదురుగా, 35 ఎకరాల విస్తీర్ణంలో రేపు జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్... ఏపీ డీజీపీ మాలకొండయ్యకు లేఖ రాశారు. జనసేన ఆవిర్భావ సభకు భద్రత అందిస్తున్నందుకు కృతజ్ఞతలని అన్నారు. అయితే, తనపై దాడి జరిగితే ప్రజా జీవితంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, గతంలో భీమవరంలో ఫ్లెక్సీ చింపేసినందుకే అభిమానులు ధర్నా చేశారని అన్నారు. ఇటీవల అనంతపురం పర్యటనలో తొక్కిసలాట ఘటన దృష్ట్యా భద్రత కోరుతున్నానని పేర్కొన్నారు. భద్రతకు పోలీసులు నిస్సహాయత ప్రకటిస్తే ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
Pawan Kalyan
Jana Sena
Guntur District

More Telugu News