Illeana D'Cruz: బాలీవుడ్‌పై బాంబు పేల్చిన ఇలియానా...!

  • బాలీవుడ్‌లో అవకాశాలకు పడక సుఖంపై మండిపాటు
  • బాధను బయటపెడితే కెరీర్ ఖతం
  • వేధింపులకు, లైంగిక హింకు వ్యతిరేకమని స్పష్టీకరణ
గోవా అందం ఇలియానా ఈ మధ్యకాలంలో సినీ రంగంపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. గతంలో దక్షిణాది సినీ పరిశ్రమ తనను 'అందాల వస్తువు'గా వాడుకుందని తీవ్రంగా విమర్శించిన ఇల్లీ బేబీ.. ఇప్పుడు బాలీవుడ్‌ను సైతం ఏకిపారేస్తోంది. తన తాజా చిత్రం 'రైడ్' ప్రమోషన్ సందర్భంగా 'బాంబే టైమ్స్' పత్రికతో ఈ ముద్దుగుమ్మ సినిమా ప్రపంచపు చీకటి కోణంపై ధైర్యంగా మాట్లాడే ప్రయత్నం చేసింది.

సినీ పరిశ్రమలో లైంగిక హింస గురించి బహిరంగంగా ప్రశ్నించే తారల కెరీర్ ముగిసిపోతుందా? అన్న ప్రశ్నకు, ప్రశ్నించకపోవడం పిరికితనమవుతుందని, కానీ, 'అవకాశాలకు పడక సుఖం' అంశంపై మాట్లాడితే మాత్రం కెరీర్ అంతమవుతుందన్న వాదనతో తాను ఏకీభవిస్తానని ఇలియానా అంటోంది.

దీనికి సంబంధించి చాలా ఏళ్ల కిందట దక్షిణాదిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఓ బడా నిర్మాత నుంచి తనకు ఎదురైన ఇదే రకమైన ఇబ్బంది గురించి తన సలహా కోరిందని తెలిపింది. అయితే అందుకు తానేమీ చెప్పలేకపోయానని, ఆమె సొంత నిర్ణయానికే వదిలేశానని ఇలియానా చెప్పుకొచ్చింది. తనకు సంబంధించినంత వరకు (లైంగిక) దోపిడీ, వేధింపులకు తాను పూర్తి వ్యతిరేకమని ఆమె స్పష్టం చేసింది.

 ఎవరైనా నటీనటులు వేధింపులకు గురవుతున్నట్లు చెబితే వారికి మిగిలిన వారు బాసటగా నిలవాలని ఆమె కోరుతోంది. తన వ్యక్తిగత జీవితం గురించి తాను మాట్లాడేందుకు నిరాకరించింది. సోషల్ మీడియాలో కొంతవరకు మాత్రమే తన విషయాల గురించి ప్రస్తావిస్తానని, తనకు నచ్చినంత వరకే పంచుకుంటానని తేల్చిచెప్పేసిందీ భామ.
Illeana D'Cruz
Raid
Cinema industry
Bollywood

More Telugu News