Prime Minister: టీఆర్ఎస్ ఎంపీ కవితకు ప్రధాని మోదీ తెలుగులో సర్ ప్రైజింగ్ శుభాకాంక్షలు

  • జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగులో లేఖ
  • ఆరోగ్యంతో, సంతోషంతో ఉండాలని ఆకాంక్ష
  • నేడు 39వ పుట్టిన రోజు జరుపుకోనున్న కవిత
ప్రధాని నరేంద్ర మోదీ టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఆశ్చర్యంలో ముంచేశారు. కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగులో లేఖ రాసి మరీ పంపించారు. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రజలకు సేవలు అందించేందుకు గాను భగవంతుడు దీర్ఘకాలం పాటు ఆరోగ్యం, సంతోషం ఇవ్వాలని కోరుకుంటున్నట్టు ప్రధాని మోదీ తన లేఖలో పేర్కొన్నారు.

1978 మార్చి 13న జన్మించిన కవిత నేడు 39వ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ, విమర్శిస్తూ, బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయం కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో, ప్రధాని ఆ పార్టీ ఎంపీని ఇలా అభినందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 
Prime Minister
Narendra Modi
K Kavitha

More Telugu News