TRS: పార్లమెంటు ముందు టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ సభ్యుల నిరసనలు

  • ప్రత్యేక హోదా కోసం టీడీపీ, వైసీపీ ఎంపీల డిమాండ్
  • రిజర్వేషన్ల కోటా పెంచాలని టీఆర్ఎస్ ఎంపీల నినాదాలు
  • ప్లకార్డుల ప్రదర్శన
ఈ రోజు తెలుగు రాష్ట్రాలకు చెందిన మూడు పార్టీల ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. టీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ల కోటా పెంచాలని రాసి ఉన్న ప్లకార్డులతో మహాత్ముని విగ్రహం ముందు నినాదాలు చేశారు.

తెలుగుదేశం ఎంపీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కూటమి ధర్మాన్ని పాటించాలి, ఆంధ్రప్రదేశ్ ను రక్షించాలని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ తో వైసీపీ ఎంపీలు కూడా పార్లమెంటులో ప్లకార్డులతో నిరసనకు దిగారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు, విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. 
TRS
Telugudesam
YSRCP
protest at parliament

More Telugu News