bnp paribas torny: చెల్లెలు సెరెనాపై విజయం సాధించిన వీనస్ విలియమ్స్

  • బీఎన్పీ పారిబాస్ ఓపెన్ లో సెరేనా అవుట్
  • మూడో రౌండ్ లో తలపడిన సెరేనా, వీనస్ విలియమ్స్
  • 6-, 6-4 తేడాతో విజయం
బీఎన్పీ పారిబాస్ ఓపెన్ టోర్నీలో చెల్లెలిపై అక్క విజయం సాధించింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సెరేనా విలియమ్స్ మళ్లీ రాకెట్ చేతబట్టి టెన్నిస్ కోర్టులో దిగింది. తొలి రౌండ్ లో విజయం సాధించిన సెరేనా విలియమ్స్ కు మూడో రౌండ్ లో బలమైన ప్రత్యర్థి ఎదురైంది. మూడో రౌండ్ లో అక్క వీనస్ విలియమ్స్ తో తలపడిన సెరేనా 6-3, 6-4 స్కోర్‌ తో ఓటమిపాలైంది. సుమారు గంటకు పైగా సుదీర్ఘంగా సాగిన మ్యాచ్ లో సెరేనా 41 తప్పులు చేసింది. దీంతో వీనస్ విలియమ్స్ ను విజయం వరించింది.
bnp paribas torny
tennis
serena williams
veenus williams

More Telugu News