Jagan: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన కాంగ్రెస్ నేత చేజర్ల నారాయణరెడ్డి

  • ప్రకాశం జిల్లాను దాటి గుంటూరులోకి పాదయాత్ర
  • బాపట్లలో జగన్ ను కలిసిన చేజర్ల
  • ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలూ చేరిక
కాంగ్రెస్ పార్టీ నేత చేజర్ల నారాయణరెడ్డి వైకాపాలో చేరారు. జగన్ పాదయాత్ర ప్రకాశం జిల్లాను దాటి గుంటూరు జిల్లాలోకి ప్రవేశించిన వేళ, తన అనుచరులతో సహా వచ్చి జగన్ ను కలిసిన చేజర్ల వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. బాపట్లలో ఉన్న జగన్, చేజర్లను పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువాను కప్పారు. చేజర్లతో పాటు కళ్లం హరినాథరెడ్డి తదితరులు వైసీపీలో చేరారు. కాగా, బాపట్ల నియోజకవర్గంలో ప్రవేశించిన జగన్ కు ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది. జగన్ సైతం ప్రజా స్పందనను చూసి మరింత ఉత్సాహంగా నడుస్తున్నారు. నేడు గుంటూరు జిల్లాలో రెండో రోజు ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది.
Jagan
Prakasam District
Guntur District
Bapatla

More Telugu News