mohammad shami: షమీ మంచోడు... ద్రోహం చేయడు: ధోనీ బాసట

  • వివాదం పూర్తిగా వ్యక్తిగతం..దీనిపై ఇతరుల స్పందన సరికాదు
  • షమీ కష్టపడే తత్వమున్న క్రికెటర్ 
  • దేశానికి, భార్యకు ద్రోహం చేయడు
టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీకి సహచరుడు, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మద్దతు పలికాడు. షమీపై తొలుత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ నోరువిప్పగా, తాజాగా ధోనీ కూడా స్పందించాడు. వివాదం పూర్తిగా షమీ వ్యక్తిగతమని చెప్పిన ధోనీ, తనకు తెలిసి షమీ మంచోడని అన్నాడు. భార్యకి, దేశానికి ద్రోహం చేయడనే అనుకుంటున్నానని తెలిపాడు. దీనిపై ఇతరులు వ్యాఖ్యానించడం సరికాదని ధోనీ పేర్కొన్నాడు. షమీ కాంట్రాక్టును బీసీసీఐ రద్దు చేయలేదని, నిలిపేసిందని తెలిపాడు. నిలిపేయడం, రద్దు చేయడం అన్నవి ఒకటి కాదని చెప్పాడు. షమీని న్యాయస్థానం దోషిగా పేర్కొనలేదని తెలిపాడు. షమీ కష్టపడే తత్వమున్న క్రికెటర్ అని కితాబునిచ్చాడు
mohammad shami
Cricketer
team india

More Telugu News