Andhra Pradesh: ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన రాయితీలు మాకూ ఇవ్వండి : పల్లె రఘునాథరెడ్డి

  • కేంద్రాన్ని డిమాండ్ చేసిన ఏపీ ప్రభుత్వ విప్  
  • ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు పరచాలి
  • మాకు ప్రజాప్రయోజనాలే ముఖ్యం
  • మా ప్రభుత్వం పైసా అప్పు చేస్తే పది పైసలు ఆదాయం వచ్చేలా చూస్తుంది : రఘునాథరెడ్డి
ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన మాదిరిగా రాయితీలు తమ రాష్ట్రానికి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ విప్ పల్లె రఘునాథ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద ఈరోజు ఉదయం ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు పరచాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని అన్నారు. ప్రజా అవసరాల కోసమే తమ ప్రభుత్వం అప్పు చేస్తుందని, తమ ప్రభుత్వం పైసా అప్పు చేస్తే పది పైసలు ఆదాయం వచ్చే విధంగా చూస్తుందని, తమకు రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని పల్లె రఘునాథరెడ్డి అన్నారు.
Andhra Pradesh
palle raghunathu reddy

More Telugu News