Pawan Kalyan: 'మహాసభ' ఏర్పాట్లను పరిశీలించి, సూచనలు చేసిన పవన్‌ కల్యాణ్

షార్ట్స్‌లో చూడండి
ఈ నెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభ గుంటూరులో నాగార్జునా యూనివర్సిటీ ఎదురుగా, 35 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతుందని ఇటీవలే ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ సభలో జనసేన సిద్ధాంతాలు, తమ నాలుగేళ్ల ప్రయాణంపై, భవిష్యత్ కార్యాచరణపై వివరిస్తానని ఆయన అన్నారు. కాగా, ఈ రోజు అమరావతిలో సొంతింటి నిర్మాణం భూమి పూజ చేసిన అనంతరం పవన్ కల్యాణ్ గుంటూరుకు వచ్చారు.     జనసేన సభ ఏర్పాట్ల గురించి నేతలను అడిగి తెలుసుకున్నారు. ఎల్లుండి తాను మాట్లాడనున్న సభావేదికపైకి ఎక్కి చూశారు. సభ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే సోషల్ మీడియా ద్వారా తమ కార్యకర్తలకు, అభిమానులకు పలు సూచనలు చేశారు.          
Go Back to Shorts
Pawan Kalyan
Andhra Pradesh
Jana Sena

More Telugu News