vankayala satyanarayana: సీనియర్ నటుడు వంకాయల సత్యనారాయణ కన్నుమూత

  • శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతోన్న సీనియర్ నటుడు
  • 150కి పైగా సినిమాల్లో నటించిన వంకాయల సత్యనారాయణ
  • విశాఖపట్నంలో తన కుమార్తె ఇంట్లో కొంత కాలంగా ఉంటోన్న నటుడు
కొంత కాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతోన్న సీనియర్‌ సినీనటుడు వంకాయల సత్యనారాయణ (78) ఈ రోజు ఉదయం మృతి చెందారు. వంకాయల సత్యనారాయణ సొంత గ్రామం విశాఖపట్నంలోని చవల వారి వీధి. ఆయన విశాఖపట్నంలోనే తన కుమార్తె ఇంట్లో కొంత కాలంగా ఉంటున్నారు. వంకాయల సత్యనారాయణ 150కి పైగా సినిమాల్లో నటించమే కాకుండా టీవీ సీరియల్స్‌లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ‘సీతామాలక్ష్మి’, ‘శ్రీనివాస కల్యాణం’ వంటి హిట్ సినిమాల్లో నటించారు.    
vankayala satyanarayana
Vizag
Tollywood

More Telugu News