Virat Kohli: సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టొద్దు... విరుష్క దంపతులకు ఫ్యాన్స్ సూచన

  • ముంబైలోని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న విరుష్క దంపతులు
  • అనుబంధాన్ని చెబుతూ సోషల్ మీడియాలో ఫోటోలు
  • ఇకపై ఫోటోలు పెట్టవద్దంటున్న ఫ్యాన్స్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సినీ నటి అనుష్క శర్మ దంపతులు తమ అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. టూర్లు, షూటింగ్ లతో నిత్యం బిజీగా ఉండే వీరిద్దరూ, హాలీడేని ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీలంక టూర్ కు విశ్రాంతి తీసుకుని కోహ్లీ ఇంట్లో ఉండగా, సూయీధాగా సినిమా షూటింగ్ విరామంతో అనుష్క ఇంటికి చేరింది. దీంతో వారిద్దరూ ఇంట్లో సేదదీరుతున్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను అప్ లోడ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా అనుష్క కొహ్లీని ముద్దాడుతున్న ఫోటోను ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ చేసింది. ఈ ఫోటో పెట్టిన క్షణాల్లో వైరల్ గా మారింది. ఆ ఫోటోను చూసిన ఫ్యాన్స్ ఇకపై అలాంటి ఫోటోలు పెట్టవద్దని, ఆ జంట అనుబంధాన్ని చూసి కన్నుకుట్టేవాళ్లు కూడా ఉంటారని, అందుకే ఇకపై ఫోటోలు పెట్టవద్దని హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆ జంటకు సూచిస్తున్నారు.
Virat Kohli
Anushka Sharma
Bollywood
Cricket
fans

More Telugu News