Sofia Hayat: తనతో ఓ రాత్రి గడిపితే రూ.20 లక్షలు ఇస్తానంటూ నటి సోఫియాకు ఆఫర్.. మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానం ఇచ్చిన నటి!

  • రూ.20 కోట్లు ఇచ్చినా తనను కొనలేరన్న సోఫియా
  • ఆ సొమ్ముతో నీ తల్లిని కొనగలవేమో కొనుక్కోమంటూ సూచన
  • ఆమె సమాధానానికి ప్రశంసల వెల్లువ
తనతో ఓ రాత్రి గడిపితే రూ.20 లక్షలు ఇస్తానన్న ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌కు బాలీవుడ్ నటి సోఫియా హయత్ దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది. జీవితంలో మరోసారి అటువంటి సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేయకుండా మైండ్ బ్లాంక్ అయ్యే రిప్లై ఇచ్చింది. @abhisheksinghbisht8 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఓ పోస్టు చేస్తూ తనతో ఓ రాత్రి గడిపితే రూ.20 లక్షలు ఇస్తానని సోఫియా హయత్‌కు ఆఫర్ ఇచ్చాడు.

ఈ పోస్టుపై సోఫియా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడికి గుణపాఠం నేర్పేలా సమాధానం ఇచ్చింది. ‘‘20 కోట్లు ఇచ్చినా నన్ను కొనలేరు.. నువ్వు ఆఫర్ చేసిన సొమ్ముతో నీ తల్లిని కొనగలవేమో. ఒకసారి మీ అమ్మను అడుగు’’ అంటూ మైండ్ బ్లాంక్ అయ్యే రిప్లై ఇచ్చింది. అంతేకాదు.. అతడి మెసేజ్‌ను స్క్రీన్ షాట్ తీసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్ అయింది. సోఫియా సమాధానం చూసి ఆమె ఫాలోవర్లు కొనియాడుతున్నారు. అతడికి సరైన గుణపాఠం నేర్పారంటూ ప్రశంసిస్తున్నారు.
Sofia Hayat
Instagram
Bollywood
Actress

More Telugu News