Pawan Kalyan: విజయవాడ చేరుకున్న ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్

  • పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్న పవన్
  • ఈ నెల 14న పార్టీ ఆవిర్భావ సభ గురించి చర్చించనున్న నేతలు
  • గుంటూరు జిల్లా కాజలో ఆవిర్భావ సభకు చురుగ్గా ఏర్పాట్లు
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్  ఈరోజు సాయంత్రం విజయవాడకు చేరుకున్నారు. డీవీ మానర్ లో జనసేన పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకున్న పవన్ కల్యాణ్, అక్కడి నుంచి విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 14న నిర్వహించనున్న ‘జనసేన’ ఆవిర్భావ సభపై ఆయన చర్చించనున్నారు. కాగా, గుంటూరు జిల్లా కాజలో జనసేన ఆవిర్భావ సభను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆవిర్భావ సభకు పవన్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకానున్నట్టు సమాచారం.
Pawan Kalyan
Vijayawada

More Telugu News