kcr: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 106 అసెంబ్లీ సీట్లు గెలుస్తాం : సీఎం కేసీఆర్

షార్ట్స్‌లో చూడండి
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 106 సీట్లు గెలవడం ఖాయమని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు నిర్వహించిన  టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి కేసీఆర్ అధ్యక్షత వహించారు. వచ్చే ఎన్నికల్లో ముగ్గురు లేదా నలుగురికి తప్ప సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇస్తామని అన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఎమ్మెల్యేలు బొడిగె శోభ, గంగుల కమలాకర్ లు తమ పద్ధతి మార్పుకోవాలని కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఢిల్లీ వెళ్తానని, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశంపై రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతానని, అవసరమైతే పార్టీ ఎంపీలతో కలిసి ధర్నా చేస్తానని కేసీఆర్ అన్నట్టు సమాచారం.
Go Back to Shorts
kcr
Telangana

More Telugu News