Andhra Pradesh: పార్టీ నిర్ణయం బాధ కలిగించినప్పటికీ చంద్రబాబు ఆదేశం శిరోధార్యం : వర్ల రామయ్య

  • పదవుల కోసం నేను పార్టీ మారే రకం కాదు
  • చంద్రబాబుకు అండగా ఉండాలనేదే నా నిర్ణయం 
  • మీడియాతో టీడీపీ నేత వర్ల రామయ్య
ఏపీ టీడీపీ రాజ్యసభ సభ్యులుగా సీఎం రమేశ్, కనకమేడల రవీంద్ర కుమార్ పేర్లను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసిన విషయం తెలిసిందే. రాజ్యసభ అభ్యర్థిగాటీడీపీ నేత వర్ల రామయ్యను ఎంపిక చేస్తారని చివరి నిమిషం వరకూ అనుకున్నారు. కానీ, మారిన సమీకరణాల ప్రకారం టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు కనకమేడల రవీంద్ర కుమార్ ను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ, పార్టీ తీసుకున్న నిర్ణయం తనకు బాధ కలిగించినప్పటికీ, అధినేత చంద్రబాబు ఆదేశం శిరోధార్యంగా భావిస్తానని అన్నారు. కొందరు నేతలు వ్యవహరించినట్లు తాను పదవుల కోసం పార్టీ మారే రకం కాదని, చంద్రబాబుకు అండగా ఉండాలనే తన నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదని అన్నారు.
Andhra Pradesh
varla ramaiah

More Telugu News