Tollywood: హోదాపై హీరోలు మాట్లాడాలి.. లేకపోతే సినిమాలను అడ్డుకుంటాం: తిరుపతిలో వినూత్న రీతిలో నిరసన

  • ప్రత్యేక హోదాపై స్పందించని సినీ హీరోలు
  • రెండు రోజుల్లోగా స్పందించాలంటూ టీఎన్ఎస్ఎఫ్ డిమాండ్
  • హీరోల ఫొటోలతో వినూత్న నిరసన
ఏపీకి ప్రత్యేక హోదాపై తెలుగు సీనీ హీరోలు స్పందించాలని టీఎన్ఎస్ఎఫ్ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగిపోతున్నప్పటికీ... హీరోలంతా చీమకుట్టన్నట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రెండు రోజుల్లో సినీ హీరోలు నోరు తెరవాలని, లేకపోతే వారి సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీ ముందు వారు నిరసన చేపట్టారు. ప్రముఖ హీరోలు చిరంజీవి, వెంకటేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్, నాగార్జున, మోహన్ బాబు, మహేష్ బాబు తదితరుల ఫొటోలను మెడలో వేసుకుని వారు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. 
Tollywood
heroes
chiranjeevi
venkatesh
protest
tnsf

More Telugu News