kavitha: ఏపీ బీజేపీకి సినీ గ్లామర్.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న సినీ నటి!

  • బీజేపీలో చేరిన కవిత
  • టీడీపీలో అవమానాలకు గురయ్యానన్న నటి
  • తనను గెంటివేశారంటూ ఆవేదన
ప్రముఖ సినీ నటి కవిత భారతీయ జనతా పార్టీలో చేరారు. విజయవాడలో ఈ ఉదయం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టారని... ఆయన స్ఫూర్తితోనే బీజేపీలో చేరానని తెలిపారు. టీడీపీ నుంచి తాను బయటకు రాలేదని... ఆ పార్టీ నుంచి గెంటివేయబడ్డానని మండిపడ్డారు. ఆ పార్టీలో ఎన్నో అవమానాలకు గురయ్యానని చెప్పారు. తిట్టినవారికి పదవులు ఇస్తున్న చంద్రబాబు... పార్టీ కోసం శ్రమిస్తున్నవారికి మొండిచేయి చూపిస్తున్నారని విమర్శించారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. 
kavitha
actress
BJP
Telugudesam

More Telugu News