rakul preet singh: పొరపాటు చేశా.. ఇప్పుడు సరిదిద్దుకుంటున్నా: రకుల్ ప్రీత్ సింగ్

  • సినిమా ఎంపికలో పొరపాట్లు జరిగాయి
  • మొహమాటం వల్ల కూడా నష్టం జరిగింది
  • ఇకపై పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటా
దక్షిణాదిలో తనకు సినీ ఆఫర్లు తగ్గిపోయాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఖండించింది. ఆ వార్తలతో తాను ఏకీభవించబోనని ఆమె తెలిపింది. సినిమాల ఎంపికలో తాను కొన్ని పొరపాట్లు చేసిన మాట నిజమేనని చెప్పింది. తెలిసి కూడా కొన్ని తప్పులు చేశానని... ఒక్కోసారి అలా చేయాల్సిన పరిస్థితులు వస్తాయని తెలిపింది. కొన్ని సందర్భాల్లో మొహమాటం వల్ల కొన్ని చేయాల్సి వస్తుందని... అవి కూడా తప్పులు జరగడానికి కారణమవుతాయని చెప్పింది. తన సినిమాలు కొన్ని పరాజయం కావడానికి పైవన్నీ కారణాలే అని తెలిపింది. ఇకపై అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతానని చెప్పింది. ఇటీవల బాలీవుడ్ లో విడుదలైన తన చిత్రం 'అయ్యారీ' నిరాశపరిచినప్పటికీ... తన నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయని తెలిపింది. త్వరలోనే తెలుగులో ఒకటి, తమిళంలో మరొక సినిమా చేయబోతున్నట్టు చెప్పింది. 
rakul preet singh
Tollywood
kollywood

More Telugu News