Rajya Sabha: రాజ్యసభ సీటు కోసం... చంద్రబాబు వద్దకు వరసగా వస్తోన్న టీడీపీ నేతలు

  • నామినేషన్లు దాఖలు చేయడానికి ఎల్లుండి చివరి తేదీ
  • అమరావతిలోని సచివాలయంలో చంద్రబాబుతో ఆశావాహులు చర్చలు
  • మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతోన్న సీఎం రమేశ్
రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్లు దాఖలు చేయడానికి ఎల్లుండి చివరి తేదీ కావడంతో అమరావతిలోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవడానికి టీడీపీ నేతలు భారీగా చేరుకుంటున్నారు. రాజ్యసభ సీటు కోసం చివరి ప్రయత్నాలు మొదలుపెట్టారు. చంద్రబాబును కలిసిన వారిలో సీఎం రమేశ్, బీద మస్తాన్ రావు, వర్ల రామయ్య, కంభంపాటి రామ్మోహన్ రావు, మసాలా పద్మజతో పాటు పలువురు ఉన్నారు.

రాజ్యసభకు అవకాశం కల్పించాలని వారు తమ పార్టీ జాతీయాధ్యక్షుడిని కోరుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012లో రాజ్యసభకు ఎన్నికైన సీఎం రమేశ్ తన గడువు ముగియడంతో మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. 
Rajya Sabha
Chandrababu
CM Ramesh

More Telugu News