వేదికపై అద్వానీని పట్టించుకోని మోదీ.. వైరల్ వీడియో
- వేదికపైకి వస్తోన్న సమయంలో తమ పార్టీ నేతలందరికీ నమస్కారం పెట్టిన మోదీ
- రెండు చేతులతో అద్వానీ నమస్కారం చేస్తున్నప్పటికీ ప్రతి నమస్కారం చేయని మోదీ
- నెటిజన్ల విమర్శలు
మోదీ వేదికపైకి వస్తోన్న సమయంలో తమ పార్టీ నేతలందరికీ నమస్కరించిన నరేంద్ర మోదీ అద్వానీని మాత్రం పట్టించుకోలేదు. రెండు చేతులతో అద్వానీ నమస్కారం చేస్తున్నప్పటికీ మోదీ ప్రతి నమస్కారం చేయకుండా వెళ్లిపోయారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. వేదికపై ఉన్న మిగతా నాయకులందరితో ఆప్యాయంగా మాట్లాడి అద్వానీకి కనీసం నమస్కారం కూడా పెట్టలేదని అంటున్నారు.