Ganta Srinivasa Rao: నా కుమారుడికి, హీరోయిన్ సాయి పల్లవికీ ఎలాంటి సంబంధం లేదు: ఏపీ మంత్రి గంటా వివరణ

  • నా కుమారుడికి వివాహమైంది
  • సాయి పల్లవితో ప్రేమాయణం లేదు
  • తప్పుడు వార్తలు రాయవద్దు
  • ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు
తన కుమారుడు, నటుడు రవితేజ, తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సాయి పల్లవిపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు. రవితేజ, సాయిపల్లవిపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం జరుగుతుందని, వైరల్ అవుతున్నట్టుగా, తన కుమారుడికి, సాయిపల్లవికి మధ్య ఎటువంటి ప్రేమ వ్యవహారమూ లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి ఇటువంటి విషయాల్లో తాను స్పందించబోనని, ఇద్దరు యువతీ యువకుల జీవితాలపై మచ్చ పడేలా వార్తలు వస్తున్నందునే వివరణ ఇస్తున్నానని అన్నారు. తన కుమారుడి వివాహం అయిందన్న విషయాన్ని కూడా మరచి ఇటువంటి అవాస్తవాలు ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. కాగా, ఇటీవల 'జయదేవ్' చిత్రంతో గంటా కుమారుడు రవితేజ హీరోగా తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.
Ganta Srinivasa Rao
Saipallavi
Raviteja

More Telugu News