raviteja: పవర్ ఫుల్ విలన్ ను రంగంలోకి దింపుతోన్న శ్రీను వైట్ల

షార్ట్స్‌లో చూడండి
వరుస పరాజయాలతో డీలాపడిపోయిన శ్రీను వైట్ల, ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేస్తున్నాడు. రవితేజ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోంది. మరో ఇద్దరు కథానాయికలకు ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

 ఈ సినిమాలో విలన్ ఎవరనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. 'ఖైదీ నెంబర్ 150'లో విలన్ గా మెప్పించిన 'తరుణ్ అరోరా'నే శ్రీను వైట్ల ఖాయం చేశాడనేది తాజా సమాచారం. 'కాటమరాయుడు' సినిమాలోను తరుణ్ అరోరా విలన్ గా చేసి .. తెలుగు ప్రేక్షకులకి బాగా గుర్తుండిపోయాడు. తమన్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమా, ఎక్కువభాగం షూటింగును అమెరికాలో జరుపుకోనుంది.   
Go Back to Shorts
raviteja
anu emmanuel

More Telugu News