Ahmadabad: హీరోయిన్ మోనాల్ గజ్జర్ కారుపై చెత్తపని చేసిన వ్యక్తి అరెస్ట్

  • అహ్మదాబాద్ లో ఘటన
  • పార్కింగ్ చేసిన కారుపై మూత్ర విసర్జన
  • మోనాల్ ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్
టాలీవుడ్ లో 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ', 'సుడిగాడు' చిత్రాల్లో నటించిన హీరోయిన్ మోనాల్ గజ్జర్, అహ్మదాబాద్ లో తన సోదరి పాయల్ నిర్వహించే బ్యూటీ పార్లర్ కు వెళ్లిన వేళ, బయట పార్క్ చేసిన కారుపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేయగా, అతనితో వాగ్వాదానికి దిగిన మోనాల్, వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సదరు వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన కమలేష్ పటేల్ గా గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కమలేష్ పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 110, 117, 294 (బీ) కింద కేసు రిజిస్టర్ చేశామని తెలిపారు. షాపింగ్ కాంప్లెక్స్ లోని టాయిలెట్లు పనిచేయకపోవడంతోనే ఖాళీగా ఉన్న స్థలంలో తాను ఇక తాళలేక మూత్రాన్ని పోశానని విచారణలో కమలేష్ చెప్పడం గమనార్హం. కాగా, తనతో వాగ్వాదానికి దిగిన మోనాల్ ను నోటికొచ్చినట్టు తిడుతున్న కమలేష్ వీడియో వైరల్ అవుతోంది.
Ahmadabad
Monal Gujjar
Car
Parking
Police

More Telugu News