Rajinikanth: తలైవా నిజంగానే హిమాలయాలకు వెళుతున్నారు: రజనీకాంత్ ప్రతినిధి

షార్ట్స్‌లో చూడండి
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆయన త్వరలోనే కొత్త పేరు ప్రకటించనున్నారు. కాగా, ఆయన మరోసారి హిమాలయాలకు వెళ్లనున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఈ విషయంపై స్పందించిన రజనీకాంత్ ప్రతినిధి రియాజ్‌ అహ్మద్‌.. ఆ వార్త నిజమేనని, తలైవా హిమాలయాలకు వెళుతున్నారని ట్వీట్ చేశారు.

గతంలోనూ రజనీకాంత్ చాలాసార్లు హిమాలయాల్లోని దునగిరిలో ఉన్న గుహల్లోకి వెళ్లి ధ్యానం చేసి వచ్చారన్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో మహా అవతార్‌ బాబాజీ నివసించాడని భక్తులు విశ్వసిస్తారు. కొన్ని నెలల క్రితం రజనీకాంత్, ఆయన మిత్రులు కలిసి అక్కడ ఓ ధ్యాన మందిరాన్ని కూడా నిర్మించారు. 
Go Back to Shorts
Rajinikanth
himalayas
Tamilnadu

More Telugu News