Tamilnadu: రైతులను తిడుతూ.. దురుసుగా ప్రవర్తించిన బీజేపీ నాయకురాలు.. మీడియాకు చిక్కిన దృశ్యాలు

షార్ట్స్‌లో చూడండి
త‌మ బాధ‌లు చెప్పుకుంటూ నిర‌స‌న వ్య‌క్తం చేస్తోన్న రైతుల వైపున‌కు త‌న‌ చెప్పు చూపించింది ఓ బీజేపీ నాయ‌కురాలు. దీంతో ఆమెపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తమిళనాడులోని తిరుచానూరు శ్రీ సుబ్రమణ్యస్వామి ఆలయం వద్ద ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. తాజాగా, తమకు రుణమాఫీ చేయాలని, ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంతంలో రైతులు నిర‌స‌న తెలిపారు. ప్రధాని మోదీ రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరును తెలుపుతూ క‌ర‌ప‌త్రాలు పంచుతున్నారు. దీంతో వారి వ‌ద్ద‌కు వెళ్లిన బీజేపీ నాయ‌కురాలు నల్లైయమ్మాళ్  రైతులతో దురుసుగా ప్ర‌వ‌ర్తించింది. వారిని దూషిస్తూ ర‌చ్చ ర‌చ్చ చేసింది. ఇటువంటి కరపత్రాలు పంచితే బాగుండ‌ద‌ని హెచ్చ‌రించింది.
Go Back to Shorts
Tamilnadu
BJP
farmers

More Telugu News