Jana Sena: కాంగ్రెస్‌కి రాజీనామా చేసి.. పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన ఏపీసీసీ ఉపాధ్యక్షుడు

షార్ట్స్‌లో చూడండి
జ‌న‌సేన ఆవిర్భావ దినోత్స‌వ మ‌హాస‌భ ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌ల‌ని మాదాసు గంగాధ‌రంకి అప్ప‌గించామ‌ని జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పినట్లు ఆ పార్టీ కార్యాలయం నుంచి మీడియా హెడ్ హరిప్రసాద్ పేరిట ప్రెస్‌నోట్ విడుదలైంది. సుదీర్ఘ‌కాలంగా ప్ర‌జా జీవితంలో ఉండి, ఎమ్మెల్సీగా రెండు ద‌ఫాలు ప‌నిచేసిన గంగాధ‌రంని తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు పవన్ కల్యాణ్ తెలిపినట్లు అందులో పేర్కొన్నారు.

తనకు 30 ఏళ్ల నుంచి గంగాధరంతో పరిచయం ఉందని పవన్ చెప్పారు. ఆయన అనుభవం, సలహాలు, సూచనలు పార్టీకి అవసరమని.. ఆయనను తమ పార్టీలో చేరమని కొన్ని రోజులుగా అడుగుతున్నానని అన్నారు. ఈ రోజు ఆయన తమ పార్టీలో చేరారని తెలిపారు. గంగాధరం ఏపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు రాజీనామా చేశారు. 
Go Back to Shorts
Jana Sena
Pawan Kalyan
Congress

More Telugu News