Anushka Sharma: పేరున్న పత్రిక అలా వ్యవహరిస్తుందని భావించలేదు... ఫేక్ ఇంటర్వ్యూపై అనుష్కశర్మ సీరియస్!

  • ఫిబ్రవరి 20న ఇన్ స్టా గ్రాంలో రొమాంటిక్ ఫొటో పోస్టు చేసిన కోహ్లీ
  • వైరల్ గా మారిన ఫోటో
  • ఆ ఫొటోపై అనుష్క ఇంటర్వ్యూ ఇచ్చిందన్న ఈ-సమయ్ పత్రిక 
ఫిబ్రవరి 20 వ తేదీన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో భార్య అనుష్కతో దిగిన రొమాంటిక్ ఫొటోను పోస్టు చేసిన సంగతి విదితమే. వెనుకనున్న ఓ చిత్రపటంలోని పోజును ఇమిటేట్ చేస్తూ .. వీరిద్దరూ దిగిన ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని ఇప్పటికే సుమారు 35 లక్షల మంది లైక్ చేశారు.

ఇక వైరల్ గా మారిన ఆ ఫోటోపై అనుష్క తమకు ఇంటర్వ్యూ ఇచ్చిందంటూ ఈ-సమయ్ అనే ఓ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. దీనిపై ట్విట్టర్ మాధ్యమంగా అనుష్క మండిపడింది. ఆ పత్రిక ప్రచురించింది ఫేక్ ఇంటర్వ్యూ అని చెప్పింది. దానిని చూసి తాను షాక్ తిన్నానని, పేరున్న పత్రిక అలా వ్యవహరిస్తుందని తాను భావించలేదని అనుష్క ట్వీట్ చేసింది. తన వ్యక్తిగత జీవితంపై ఎవరికీ ఇంటర్వ్యూ ఇవ్వలేదని తేల్చి చెప్పింది. 
Anushka Sharma
Virat Kohli
ei-samay

More Telugu News