prashanth varma: ఆ పట్టుదలతో 'అ!' కథ రాశాను: దర్శకుడు ప్రశాంత్ వర్మ

  • ముందుగా అనుకున్న సినిమా ఆగిపోయింది
  •  నాలో పట్టుదల పెరిగింది
  • వారంరోజుల్లో 'అ!' కథను రాసేశాను
ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను పలకరించిన వైవిధ్యభరితమైన చిత్రాలలో 'అ!' ఒకటని చెప్పాలి. దర్శకుడిగా ఈ సినిమా ప్రశాంత్ వర్మకి మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. 'అ!'కంటే ముందు ఒక సినిమాను కమిట్ అయ్యాను. జనవరి 1 ఉదయం ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లవలసి వుంది.

"డిసెంబర్ 31 రాత్రి ఫ్రెండ్స్ ను పిలిచి పార్టీ ఇస్తున్నాను. 11.30 గంటలకు కాల్ వచ్చింది. ఒక నిర్మాత తప్పుకోవడం వలన, ఆ ప్రాజెక్టు కేన్సిల్ అయినట్టు. పార్టీ మూడ్ పోవడంతో అంతా వెళ్లిపోయారు. అంతే .. అనుకున్న సమయానికి ఒక సినిమా చేయవలసిందే అనే పట్టుదల నాలో పెరిగింది. రాత్రి 12 గంటల నుంచి మరో కథ రాయడం మొదలుపెట్టాను. అలా 'అ!' సినిమా కథను వారం రోజుల్లో రాశాను" అంటూ చెప్పుకొచ్చాడు.      
prashanth varma

More Telugu News