Telugudesam: చంద్రబాబుకు మా సెల్యూట్: ఆర్జేడీ

  • ఆయన ఎంతో ధైర్యం చూపించారు
  • పొగడ్తలు కురిపించిన ఆర్జేడీ
  • ఆయన్ను చూసి నేర్చుకోవాలని నితీశ్ కు హితవు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన పనికి, ఆయన చూపిన ధైర్యానికి తాము సెల్యూట్ చేస్తున్నామని ఆర్జేడీ వ్యాఖ్యానించింది. ఇప్పటికైనా బీహార్ సీఎం నితీశ్ కుమార్, చంద్రబాబును చూసి నేర్చుకోవాలని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మనోజ్ ఝా మీడియా ముందు వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ బీజేపీపై తిరుగుబాటు ప్రకటించిన చంద్రబాబును చూసి సెల్యూట్ చేస్తున్నామని, తెలంగాణ ఏర్పాటు వల్ల ఆంధ్రప్రదేశ్ ఎలా నష్టపోయిందో, జార్ఖండ్ ఏర్పాటు తరువాత బీహార్ కూ అదే విధమైన నష్టం జరిగిందని, కానీ చంద్రబాబులా ధైర్యంగా నితీశ్ వ్యవహరించడం లేదని ఆయన ఆరోపించారు.

గతంలో నితీశ్ కుమార్ కూడా ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశారని, ఆపై ఆ డిమాండ్ ను మరచిపోయారని విమర్శించారు. మోదీతో, అమిత్ షాతో మాట్లాడాలంటేనే ఆయన వణికిపోతున్నారని ఆరోపించారు. ఇక రాష్ట్ర ప్రజలు నితీశ్ మౌనాన్ని భరించే స్థితిలో లేరని, తమ పార్టీ ఆందోళనా కార్యక్రమాలను చేపడుతుందని అన్నారు.
Telugudesam
Andhra Pradesh
RJD
Bihar
Manoj Jha
Nitish Kumar

More Telugu News