Donald Trump: ఆమెతో నాకు సంబంధాలు లేవు: డొనాల్డ్ ట్రంప్

  • ట్రంప్ తో శారీరక సంబంధం ఉందని ఆరోపించిన పోర్న్ స్టార్
  • డబ్బిచ్చి సంతకాలు చేయించుకున్నారంటూ ఆరోపణ
  • ఆరోపణలను ఖండించిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో తనకు శారీరక సంబంధాలు ఉండేవని... ఆ విషయాన్ని బయట పెట్టకుండా ఉంచేందుకు... ఆయన న్యాయవాది మైఖేల్ కోహెన్ తనకు రూ. 1.30 లక్షల డాలర్లు ఇచ్చి, కొన్ని పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారంటూ పోర్న్ స్టార్ స్టెఫానీ క్లిఫర్డ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, స్టెఫానీ ఆరోపణలను ట్రంప్ ఖండించారు. ఆమెతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని ఆయన అన్నారు. వైట్ హౌస్ మీడియా కార్యదర్శి శారా సాండర్స్ మాట్లాడుతూ, తనపై వచ్చిన ఆరోపణలను ట్రంప్ తోసిపుచ్చారని తెలిపారు.  
Donald Trump
porn star

More Telugu News