Muktyala: ముక్త్యాల సంస్థానం చివరి మహారాణి వాసిరెడ్డి రాజ్యలక్ష్మి కన్నుమూత

  • చెన్నై ఆసుపత్రిలో కన్నుమూత
  • ఆమె వయసు 94 సంవత్సరాలు
  • గతంలో ఎమ్మెల్యేగానూ పనిచేసిన రాజ్యలక్ష్మి
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల సంస్థానం చివరి మహారాణి వాసిరెడ్డి రాజ్యలక్ష్మి గత రాత్రి చెన్నైలో మృతిచెందారు. ఆమె వయసు 94 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని కుటుంబీకులు తెలిపారు. ఆమె జగ్గయ్యపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగానూ పని చేశారు. ఈ ప్రాంతంలో వివిధ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యమయ్యారు. కేసీపి షుగర్స్ సీఎండి వెలగపూడి ఇందిరాదత్ కు ఆమె తల్లి. వాసిరెడ్డి రాజ్యలక్ష్మి మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు.
Muktyala
Vasireddy Rajyalakshmi

More Telugu News