Hyderabad: అపార్టుమెంట్ పై నుంచి దూకి ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య

  • హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో విషాదం
  • అపార్ట్ మెంట్ లోని ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య
  • అక్షర ఇంటర్నేషనల్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు
హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు అపార్టుమెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల సమాచారం ప్రకారం, అక్షర ఇంటర్నేషనల్ పాఠశాలలో భార్గవి పటేల్, శ్రావణి పదో తరగతి చదువుతున్నారు. స్థానిక టీఎన్ఆర్ అపార్ట్ మెంట్ లోని ఎనిమిదో అంతస్తు పై నుంచి దూకిన ఇద్దరు విద్యార్థినులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.   
Hyderabad
sarurnagar

More Telugu News