bjp: కామినేని, మాణిక్యాలరావు రాజీనామాలను ఆమోదించిన గవర్నర్

  • ఏపీ మంత్రి వర్గం నుంచి వైదొలగిన బీజేపీ నేతలు కామినేని, మాణిక్యాలరావు
  • గవర్నర్ కు సమర్పించిన రాజీనామా లేఖలు ఆమోదం
  • సీఎం చంద్రబాబుకు అందిన సమాచారం!
తమ మంత్రి పదవులకు రాజీనామా చేస్తూ కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావులు
సమర్పించిన లేఖలను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. కాగా, ఈరోజు ఉదయం చంద్రబాబును కామినేని, మాణిక్యాలరావు కలిసి తమ రాజీనామా లేఖలను సమర్పించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కామినేని, దేవాదాయ శాఖ మంత్రిగా మాణిక్యాలరావు సమర్థంగా పనిచేశారని చంద్రబాబు ప్రశంసించడం విదితమే. ఇదిలా ఉండగా, కేంద్రంలోని టీడీపీ మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజుల రాజీనామా లేఖలను ఆమోదించారా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.
bjp
Andhra Pradesh

More Telugu News