Chandrababu: చంద్రబాబు ఇటలీ భాష నేర్చుకుని మరీ, సోనియాను అడిగారంటూ రోజా వ్యంగ్యాస్త్రాలు

  • రాష్ట్ర విభజన చేయాలని ఇటలీ భాషలో సోనియాను అడిగారు
  • ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు
  • ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకొచ్చి పోరాడాలి  
సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ఇటలీ భాష నేర్చుకుని మరీ రాష్ట్ర విభజన చేయాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీని నాడు అడిగారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రోజుకో మాట చెబుతూ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని, కేంద్ర మంత్రి వర్గం నుంచి వైదొలగడం కాదని, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక హోదా కోసం టీడీపీ పోరాడాలని సూచించారు. టీడీపీ ఆ విధంగా చేస్తే తాము మద్దతు ఇస్తామని అన్నారు.
Chandrababu
roja

More Telugu News