kcr: అందుకే, కేసీఆర్ థర్ఢ్ ఫ్రంట్ డ్రామాలు : వీహెచ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకే కేసీఆర్ థర్ఢ్ ఫ్రంట్ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. ఎప్పుడైతే, థర్డ్ ఫ్రంట్ ను కేసీఆర్ ఏర్పాటు చేస్తారో అప్పుడు ఆయన దుకాణం బంద్ అవుతుందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 106 సీట్లు కాదు కదా, 16 సీట్లు కూడా రావని వీహెచ్ జోస్యం చెప్పారు.